జూన్ నెల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల

TG: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జూన్ నెలకు సంబంధించిన రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసింది. ఇకపై ప్రతి నెలా రూ.250 కోట్లను సంబంధిత సంక్షేమ శాఖలకు అందిస్తామని, నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నాలుగు విడతల్లో జమ చేయాలని సూచించింది. ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి ఖాతాల్లో ఆగస్టు 15న ఈ మొత్తాన్ని జమ చేయనుంది.

సంబంధిత పోస్ట్