జూపల్లి తీరు పూటకో సవాల్.. రోజుకో అడ్రస్‌లా ఉంది: హరీష్ రావు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు తమ రాజీనామా సవాల్‌కు కట్టుబడి ఉండాలని, సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్‌కు వస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. దీనిపై స్పందించిన హరీష్ రావు.. మంత్రులు గోల్ కొడతామని సెల్ఫ్ గోల్ అయ్యారని, జూపల్లి తీరు పూటకో సవాల్, రోజుకో అడ్రస్‌లా ఉందని విమర్శించారు. తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పింది జూపల్లేనని, గన్‌పార్క్‌కు ఆహ్వానిస్తే తాము వెళ్లేందుకు సిద్ధమయ్యామని, అయితే పోలీసులు తమను అడ్డుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్