బాబ్రీ మసీద్ ఏకసభ్య విచారణ కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్‌హాన్ (87) ఆదివారం చండీగఢ్‌లో తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 1964లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించిన లిబర్‌హాన్, 1987లో పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జిగా, 1997లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ కమిషన్‌కు ఆయన నేతృత్వం వహించడం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.