వెలుగుమట్ల భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి: కవిత

టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత మంగళవారం గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, వెలుగుమట్లతో పాటు వికారాబాద్‌ జిల్లా కడ్లాపూర్‌, ట్రిపుల్‌ ఆర్‌ బాధితులతో కలిసి గవర్నర్‌ను కలిశామని తెలిపారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని, కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్కు కోసం జారీ చేసిన భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్