ఆర్చరీలో మరోసారి సత్తాచాటిన జ్యోతి సురేఖ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత స్టార్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ గెలుచుకుని మరోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. గురువారం జరిగిన వ్యక్తిగత ఫైనల్‌లో ఆమె 147-145తో మరో భారత ఆర్చర్ ప్రతీక ప్రదీప్‌ను ఓడించింది. టీమ్ ఈవెంట్‌లో జ్యోతి, ప్రతీక, దీప్షిక త్రయం కొరియాను 236-234 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఇది జ్యోతికి వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లు కలిపి 7వ ఆసియా చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్.

సంబంధిత పోస్ట్