కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. యెమెన్ ప్రభుత్వం నిన్న అమలు చేయాల్సిన ఆమె మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. దీంతో కొంత ఊరట లభించింది. నిమిష ప్రియకు బ్లడ్‌మనీ ఇప్పించేందుకు చొరవలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ప్రధాని మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఆమెను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.