TG: సీఎం రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడుగురు అన్నదమ్ములు కలిసి లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఓ వీడియోలో ఆరోపించారు. 'రేవంత్ రెడ్డిని సీఎంను చేసి, రాష్ట్రాన్ని వాళ్లు దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చారు. భారత్ సమ్మిట్ అంటూ కాంగ్రెస్ నాయకులు నోవాటెల్ హోటల్లో మందు తాగుతూ చిందులేశారు. మరోవైపు తెలంగాణ ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. అవినీతిపరుడు రాష్ట్రాన్ని పాలిస్తే రాష్ట్రమంతా అవినీతి అవుతుందని రేవంత్ రెడ్డి పాలన చూస్తే కనిపిస్తుంది' అని ఆరోపించారు.