AP: కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 35 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.