కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తుది నివేదికను ఇవాళ (గురువారం) జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించనుంది. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ చంద్రఘోష్ అధ్యక్షతన కమిషన్ వేసిన విషయం తెలిసిందే. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కమిషన్.. షీల్డ్ కవర్లో తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.