కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కాళేశ్వరం కమిషన్ దాదాపు 16 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలను పరిశీలించి.. 650 పేజీల తుది నివేదికను రెండు సీల్డ్ కవర్లలో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలు, నిర్ణయ తప్పిదాలు వంటి కీలకమైన వివరాలు ఉన్నాయి. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.