కాళేశ్వరం కట్టింది.. అది కూలింది BRS హయాంలోనే: ఉత్తమ్

TG: కాళేశ్వరం కట్టింది, అది కూలింది BRS హయాంలోనే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం నిర్వహించిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. BRS హయాంలో 90 శాతం రేషన్ బియ్యం వృథా అయ్యాయని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పంపిణీ ఇదే తొలిసారని అన్నారు.

సంబంధిత పోస్ట్