కల్కి 2898 ఏడీ.. బుజ్జి పాత్రపై కీర్తి సురేశ్ వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కల్కి 2898 ఏడీ' విడుదలై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా, సినిమాలో కీలక పాత్ర పోషించిన 'బుజ్జి'కి స్వరం అందించిన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మొదట తనకు ఆన్-స్క్రీన్ పాత్ర ఆఫర్ చేసినా, అది నచ్చక తిరస్కరించానని, ఆ తర్వాతే బుజ్జి పాత్ర దక్కిందన్నారు. కేవలం వాయిస్ మాత్రమే ఇవ్వాలని, షూటింగ్‌కు రావాల్సిన అవసరం లేదని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని, ఇది కొత్త కాన్సెప్ట్ అనిపించి వెంటనే అంగీకరించానని కీర్తి వివరించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో బుజ్జికి డబ్బింగ్ చెప్పిన కీర్తి, ప్రతి భాషకు అనుగుణంగా స్వరంలో మార్పులు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్