ప్రభుత్వ లాంఛనాలతో కల్కి భగవాన్ మహాసమాధి

AP: తిరుపతి జిల్లా, వర్ధయ్యపాళెం మండలం బత్తలవల్లం 'ఏకం క్షేత్రం'లో కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు కల్కి భగవాన్ చివరి చూపు కోసం అనుమతి ఇవ్వనున్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕