పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులు తిరగరాస్తోంది. ఇటీవల ఈ చిత్రం రూ.1000 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. అయితే, ‘కల్కి’ ఓటీటీలో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. థియేటర్‌లో విడుదలై 10 వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయనున్నారు. అంటే సెప్టెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ‘కల్కి’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.