Kalki 2898 AD సినిమాలో నటించిన ప్రభాస్, అమితాబ్ ఇతర సినీ బృందంపై కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి తాజాగా ఆయన లీగల్ నోటీసులు పంపించారు. సినిమాలో తల్లి (దీపికా పదుకొణె) కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టినట్లు సినిమాను తెరకెక్కించారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. సినిమాల్లో హిందూ గ్రంథాలను వాడుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయిందన్నారు.