సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. 2021 డిసెంబర్ 6న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317 వల్ల వేలాది మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని ఆమె కోరారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ జీవోను సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు.