ఓటు హక్కుపై కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీ: కమల్ హాసన్ ఆందోళన

సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ దేశ పౌరుల ఓటు హక్కు ప్రాథమిక హక్కు అని, కేంద్ర ఎన్నికల సంఘం ఎస్.ఐ.ఆర్ పేరుతో దాన్ని తనిఖీ చేస్తోందని అన్నారు. తమిళనాడులో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, ఓటరు జాబితా పరిశీలనల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయని, దీనివల్ల రాష్ట్రంలో దాదాపు కోటి మంది అర్హులైన ఓటర్లు చనిపోయినవారి జాబితాలో ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌లో బతికున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారని, అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్