కమలహాసన్ అంత మేధావిని కాదు: రజనీకాంత్

ఎస్. వెంకటేశన్ రచించిన వేల్పారి పుస్తకానికి వస్తున్న విశేష స్పందనను పురస్కరించుకుని చెన్నైలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. "ఇలాంటి సాహిత్య సమావేశాలకు కమలహాసన్ లాంటి మేధావులను పిలవాలి. 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని స్లో మోషన్‌లో నడిచే నన్ను ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదు" అని నవ్వుతూ అందరినీ అలరించారు.

సంబంధిత పోస్ట్