అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం సంపంగి నరసయ్య తన ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడని తెలిపారు. మృతుడి సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.