నిజామాబాద్: ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ ఆర్టీసీ-2 డిపోకు చెందిన షేక్ ఇమామ్ సాహెబ్ ఖమ్మం డిపోకు బదిలైన ఆర్టీసీ అధికారులు రిలీవ్ చేయడం లేదని మనస్థాపానికి గురై గురువారం ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ సాహెబ్ ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ గా చేస్తుండేవాడు. 3 ఏళ్ళ క్రితం ఆర్టీసీ ఈడీ ఖమ్మం జిల్లా నుంచి 6 నెలల కోసమని నిజామాబాద్ జిల్లాకు బదిలీపై పంపారు. నిజామాబాద్-2 డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా ఆరు నెలలుగా పని చేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్