నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని పాటి హనుమాన్ గుడి సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి శవమై తేలాడు. అతని వయస్సు సుమారు 35 నుండి 40 సంవత్సరాల మధ్యగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.