ఏబీవీపీ అభ్యాస వర్గ ఘనంగా ప్రారంభం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఇందూరు విభాగ్ ఆధ్వర్యంలో రెండు రోజుల అభ్యాస వర్గ కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం, తిమ్మాపూర్ లోని తెలంగాణ తిరుపతి దేవస్థానంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ABVP తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇందూర్ విభాగ్ అభ్యాస వర్గ జరుపుకోవడం శుభ సందర్భమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕