కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పిట్ల సాయిబాబా, నాయకులు కాపర్తి రవి, చిటికె వెంకట్, ఇంద్ర గౌడ్, కాశీరాం పాల్గొన్నారు.