బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన జోగోల్ల ప్రవీణ్(25) బుధవారం దీపావళి పండుగకు హస్గుల్ లోని తన అత్తగారింటికి బైక్ పై వెళ్తుండగా దామరంచ శివారులో ఐచర్ వాహనం ఢీ కొట్టింది. దీనితో అతని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.