బాన్సువాడ పట్టణంలో రూ. 37. 50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు. అనంతరం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందర జాతీయ రహదారి పనులలో భాగంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ మరియు ఫుట్ పాత్ పనులను పరిశీలించారు.