బాన్సువాడ 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నాగనాథ్ నామినేషన్ దాఖలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 15వ వార్డుకు చెందిన యువ నాయకుడు నాగనాథ్ గురువారం తన మొదటి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పట్టణంలోని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా నాగనాథ్ మాట్లాడుతూ 15వ వార్డు సమస్యలపై అవగాహన ఉందని, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని, వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్