బాన్సువాడ నియోజకవర్గ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా జుక్కల్ దాని తండాకు చెందిన సీనియర్ బంజారా నాయకులు బన్సీ లాల్ ను ఏఐబిఎస్ఎస్ జిల్లా శాఖ నియమించింది. ఈ సందర్భంగా సోమవారం ఆయనను బాన్సువాడలో బంజారా నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోహన్ నాయక్ , జగ్రాం, తదితరులు పాల్గొన్నారు.