భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావును హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శాలువాతో రామచంద్ర రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సున్నం సాయిలు, ప్రశాంత్ గౌడ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.