బాన్సువాడలోని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, నాయకులు జంగం గంగాధర్, అంజిరెడ్డి, శ్యామల, ఎజాస్, ఖాలేఖ్, పిట్ల శ్రీధర్, మోహన్ నాయక్, యండి. దావూద్, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.