బాన్సువాడ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో చదువుకొని డివిజన్ ర్యాంకర్ గా నిలిచిన మద్దెలచెరువు గ్రామానికి చెందిన గైని ఇందును శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.