తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'వన మహోత్సవం-2025' కార్యక్రమంలో బాగంగా శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి సలాం, సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.