బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన మహిళ శనివారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని మహిళను, పసికందును కాపాడారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాపాడిన వారిలో ఏఎస్ఐ జయ విజయ, కానిస్టేబుళ్లు ప్రవీణ్, సౌజన్య, నవీన్, అంజయ్య శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.