కామారెడ్డి జిల్లా జుక్కల్ పట్టణంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు అరుణతార ఆధ్వర్యంలో మేధావులతో సంగోష్ఠి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అరాచక శక్తులను తరిమికొడదాం అనే నినాదంతో గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బిజెపి మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.