అంగన్వాడీ టీచర్లను సన్మానించిన బిజెపి నాయకులు

కామారెడ్డి జిల్లా, బాన్సువాడలోని నస్రుల్లాబాద్ లో మంగళవారం బిజెపి నాయకులు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పాల్గొని అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. చిన్న పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు చందూరి హనుమాన్లు, వడ్డ సతీష్, శేఖర్, లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕