కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిరుమలపూర్ లోని అంగన్వాడి కేంద్రాన్ని మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడి టీచర్, ఆశ వర్కర్ లను సన్మానించి, పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రూరల్ మండల అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడి టీచర్ స్వప్న, ఆశ వర్కర్లు సుమలత, స్వరూప, బిజెపి నాయకులు దోమకొండ సాయిప్రసాద్, కమ్మరి శివకుమార్, గుర్ల సాయిలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.