కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గంగాధర్, నార్ల అరుణ్, ఉప్పరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.