ఇబ్రహీంపేట్ లో విద్యుత్ షాక్ తో బాలుడి మృతి

బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలోని గంగపుత్ర కాలనీకి చెందిన దుబాయ్ సాయిలు కుమారుడు గోవర్ధన్ సాయిలు (12) మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడంతో మృతుడి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే ఒక్క కుమారుడు విద్యుత్ షాక్ కు గురి కావడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్