బాన్సువాడ పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలీలు చేస్తున్ననిరవధిక సమ్మె నాలుగవ రోజులో భాగంగా శనివారం ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు మాట్లాడుతూ హామాలీల న్యాయమైన కోరికలను నెరవేర్చలన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టి సాయిలు, సాయిలు, బాలరాజ్, హన్మాండ్లు, సాయిలు, సాయిలు, భూమయ్య, చిన్న సాయిలు, భూదవ్వ తదితరులు పాల్గొన్నారు.