బాన్సువాడ పట్టణం లోని శ్రీనివాస గార్డెన్స్ లో శుక్రవారం కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధు సుదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్, నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.