కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో శుక్రవారం గాందీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సహనం అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మ గాంధీ మహనీయుడని అన్నారు. స్వాతంత్ర సమరంలో గాంధీజీ చూపిన అహింసా మార్గం, ప్రజలను ఏకం చేసిన నాయకత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.