తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా, సోమవారం బాన్సువాడ పట్టణంలోని కిష్టయ్య విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పొచారం శ్రీనివాస రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ ముదిరాజ్ సంఘం నాయకులు, బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కిష్టయ్య త్యాగాన్ని స్మరించుకున్నారు.