కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం బోర్లం లో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ కవిత వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నే రమేష్, క్యాంప్ సర్పంచ్ బసవయ్య, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు నర్సింలు, సెక్రటరీ సురేందర్, ఉప సర్పంచ్ సునుగురు పెద్ద బస్వయ్య, వార్డ్ మెంబర్లు గాండ్ల సాయిలు, గంగారం, నాయకులు జనార్దన్ రెడ్డి గోపంపల్లి సాయిలు, సుభాష్ గౌడ్, నాగభూషణం, బొప్పని శ్రీనివాస్, రైతులు రాజిరెడ్డి, వెంకాగౌడ్, దామరాంచ విఠల్, శ్రీహరి, సొసైటి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కొనుగోలు కేంద్రం రైతుల నుండి వరి ధాన్యాన్ని సేకరించడానికి ఏర్పాటు చేయబడింది.