రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలలో చేపడుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో, ఉన్నత విద్యా, ఉద్యోగాలలో, వృత్తి విద్యా కోర్సులలో ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల ఎస్సీలో గల మాల, వాటి ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రస్తుతం ఉన్న రోస్టర్ ను వెంటనే సవరించే వరకు నోటిఫికేషన్ లు నిలిపివేయాలని మాల సంఘo తెలంగాణ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ బుదవారం బాన్సువాడలో డిమాండ్ చేశారు. ఈనెల 8న కామారెడ్డి జిల్లా కేంద్రంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాపురం రాజు, కంకణాల రమేష్ , బోరంచ నరేష్, లక్ష్మీనారాయణ, బాబు, రాజు పాల్గొన్నారు.