బీర్కూర్ లో రజక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు నగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం బలోపేతం, సంక్షేమ కార్యక్రమాలు, సభ్యుల సమస్యలపై చర్చించారు.
ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ సామాజిక సంఘాల ఐక్యతతో గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రజక సంఘం అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి పంచాయతీ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, సభ్యులు, గ్రామ యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕