కిరణ్మయి బదిలీ: ప్రజలకు నిరాశే మిగిలింది!

బాన్సువాడ సబ్‌ కలెక్టర్ కిరణ్మయి బదిలీ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే ప్రజాభిమానాన్ని చూరగొన్న ఆమె, ఇటీవల బూర్గూల్‌లో ఆత్మహత్యకు యత్నించిన బాలికను ట్యాంకు ఎక్కి బుజ్జగించి కాపాడారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు, గత ఏడాది జలప్రళయం సమయంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. ఆమె బదిలీతో ప్రజలు ఒకింత నిరాశ చెందారు.

సంబంధిత పోస్ట్