బాన్సువాడ ప్రభుత్వ కళాశాలలో వైద్య శిబిరం: విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

కామారెడ్డి జిల్లా, బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల (అటానమస్) జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో బాన్సువాడకు చెందిన ప్రముఖ చర్మవ్యాధి, కాస్మోటాలజీ నిపుణులు డాక్టర్ సౌజన్య గోలే, వైద్య నిపుణులు డాక్టర్ సాయిలు మన్నె ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూరు గంగాధర్, అధ్యాపకులు రఫియా, కృష్ణ, పద్మ, సన బేగం, బాలరాజ్, వినయ్, విట్టల్, రేఖ, అనిత, రాజేష్, శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్