బాన్సువాడ పట్టణ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసం వద్ద బాన్సువాడ నియోజకవర్గంలోని 43 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ. 12,86,000/- ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సహాయ నిధి ద్వారా లబ్ధి పొందినవారు ఎమ్మెల్యే పోచారంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎజాస్ కృష్ణారెడ్డి, బాబా, యండి. దావూద్, హకీమ్, రాజశేఖర్, వెంకట్, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.