బాన్సువాడ లో నమామి భారతం కార్యక్రమం

వందేమాతరం గీతాలాపన 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో నమామి భారతం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఒకే సమయం ఒకే స్వరం, ఒకే లయతో కోటి మందితో సంపూర్ణ వందేమాతరం సామూహిక గీతాలాపన జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో, పాత బాన్సువాడ చావిడి వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు గాజుల రాజులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕