నిజాంసాగర్: నవోదయలో లైంగిక వేధింపులు.. టీచర్లకు రిమాండ్‌

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయలో విద్యార్థులను లైంగికంగా వేధించిన నలుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. గతంలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని కర్ణాటకకు బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్