కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు సంఘంలో మంగళవారం జరిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ, విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి షేక్ సలాం, ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.